తెనాలి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నాలుగో వార్డు బీసీ కాలనీలోని పెట్రోల్ బంకు దగ్గర నుంచి గురువారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ నేతృత్వంలో జరిగే కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొనాలని కోరారు.