చేబ్రోలు మండలం లోని ఎస్సీ కాలనీకి చెందిన గర్భిణీ పరిమళ కు బుధవారం పురిటి నొప్పులు రావడంతో 108 వాహనం ద్వారా తెనాలి ప్రభుత్వ వైద్యశాల తరలిస్తుండగా వేజెండ్ల గ్రామ సమీపంలో పురిటి నొప్పులు అధికమవడంతో 108 సిబ్బంది వాహనం పక్కకు నిలిపి పరిమళ కు వైద్య సేవలు చేశారు. పరిమళకు మగ బిడ్డ జన్మించాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండటంతో పరిమళ కుటుంబ సభ్యులు 108 సిబ్బందిని అభినందించారు.