-అజెండాగా చేనేత రంగ సమగ్ర అభివృద్ధి
-స్టీరింగ్ కమిటీ ఏర్పాటుతో సమావేశం
-చేనేత సమస్యల పరిష్కారం కోసం మీడియా మద్దతు
అమరావతి నుంచి సూర్య ప్రతినిధి : చేనేత సమస్య లపై వీవర్‌స యునైటెడ్ ఫ్రంట్ రాష్ర్ట స్థాయి ప్రతినిధుల సమావేశం మార్చి 04, 2017 మధ్యాహ్నం 3 గంటలకు వీవర్‌స యునైటెడ్ ఫ్రంట్ సమావేశం జరుగుతోంది. ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు శీరం శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం, రామకృష్ణ సమావేశ మందిరంలో జరుగుతుంది. చేనేత చరిత్రలో మైలురాయిగా పిఠాపురం వేదిక కాబోతుంది. అన్ని చేనేత కులాల ప్రతినిధులతో వీవర్‌స యునైటెడ్ ఫ్రంట్ రాష్ర్ట స్థాయి ప్రతినిధుల సమావేశానికి రాయలసీమ, ఆంధ్రా ప్రతినిధులు పెద్దసంఖ్యలో రానున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోని ప్రతినిధులను ఆహ్వానిం చడం జరిగింది. ఈ సమావేశంలో అజెండాగా చేనేత రంగ సమగ్ర అభివృద్ధి, వీవర్‌స యునైటెడ్ ఫ్రంట్ కార్య వర్గం ఏర్పాటు, వీవర్‌స యునైటెడ్ ఫ్రంట్ కార్యాలయాలు ఏర్పాటు, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు తోపాటుగా, సమావేశం ప్రతిపాదించిన ఇతర అంశాలపై చర్చ మరియు ప్రతి పాదిత తీర్మానాలు ఉంటాయని రాష్ర్ట కన్వీనర్, వీవర్‌స యునైటెడ్ ఫ్రంట్ నేతలు శీరం శ్రీరామచంద్రమూర్తి, కోట వీరయ్య, తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. వీవర్‌స యునైటెడ్ ఫ్రంట్ అందర్ని కలుపుకొని అన్ని చేనేత కులాల సహకారంతో చేనేత కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివ ద్దికి క షిచేయాలన్న మౌలిక అంశాన్ని ద ష్టిలో ఉంచుకొని పద్మశాలీ సాథికార సంస్థ ప్రతినిదులనూ ఆహ్వానించడం జరిగింది. ప్రపంచంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7వ స్థానంలో ఉండి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండంకెలు స్థాయి జిడిపి సాధించిన రాష్ట్రాలలో అగ్రగామిగా ఉందని మన ఆర్థిక సర్వే చెపుతుంది. ఒకవైపు దేశ, రాష్ర్ట అభివ ద్ది జరుగుతున్నా ఆర్థిక ఫలాలు అందుకోవడంలో సగటు నేత కార్మికుడు, చేనేత వర్గం చాలా వెనుకబాటులో ఉంది. ఈ పరిస్థితి మారాలి. చేనేత కులాలు సంఘటితంతో మన హక్కులు సాధించుకోవాలన్న ఉద్దేశం నేతన్నలలో ఉంది. పిఠాపురం, మున్సిపల్ కళ్యాణ మండపం అతిథిలకు ఆత్మీయ స్వాగతం పలకడానికి శీరం ప్రసాదు ఏర్పాట్లు చేస్తున్నారు. చేనేత లక్ష్య సాధన కోసం, అభివృద్ది, సంక్షేమం కోసం, ముఖ్యంగా మన ఐక్య కార్యచరణ కోసం ఏర్పాటు చేసిన ఈ సభకు పెద్ద మనసు చేసుకొని రావాలని ప్రార్థిస్తున్నాం. కార్యక్రమ విజయానికి సహకరించమని కోరుతున్నామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa