ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీమా పథకాలపై సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2017, 02:15 AM

   విజయవాడ, సూర్య బ్యూరో : రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చేందుకు భీమా పథకాలను మరింత సమర్థవంతంగా క్షే్త్ర స్థాయిలోకి తీసుకువెళ్లాల్సి ఉందని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి బి.రాజశేఖర్‌ వెల్లడించారు. కమాండ్గ కమ్యూనికేషన్‌ సెంటర్‌లో గురువారం ప్రధాన మంత్రి ఫసల్‌ భీమా యోజన (పీఎంఎఫ్‌బివై), వాతావరణ ఆధారిత పంట భీమా (డబ్లు్యబిసిఐఎస్‌), ఏకీకత ప్యాకేజీ భీమా పథకం (యుపిఐఎస్‌)లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన పంటకు ఆదాయం అందించేందుకు భీమా పథకాలు ఎంతో  ఉపయుక్తంగా వుంటాయన్నారు. ఇన్సూరెన్‌‌స కంపెనీలు, బ్యాంకర్లు అధికారులతో సమన్వయం చేసుకొని రైతులకు  ప్రయోజనం కలిగించే విధానాలను క్షే్త్ర స్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామం, మండలం, జిల్లా యూనిట్‌ గా రూపొందించిన క్రాప్‌ ఇన్సూరెన్‌‌స విధానాలపై ఉన్నతస్థాయి సమావేశంలో వచ్చిన  అంశాలను రాష్ర్టవ్యాప్తంగా అమలుకు ప్రతిపాదనలను రూపొందించాల్సి ఉందన్నారు. పీఎంఎఫ్‌ బీవై ద్వారా 2016 ఖరీఫ్‌ సందర్బంగా రూపొందించిన రెండు క్లస్టర్‌ విధానాలను 2017 ఖరీఫ్‌కు కూడా  అమలు చేసేందుకు రాష్ర్టస్థాయి సమన్వయ కమిటీ పరిశీలించింది. 2017 ఖరీఫ్‌లో పండించే 19 రకాల పంటలకు పీఎమ్‌ఎఫ్‌ బీవై కింద బీమా పథకం వర్తింపుపై చర్చించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలోని ప్రధాన పంటలను గ్రామం బీమా యూనిట్‌గా  వరి పంటను గుర్తించడం జరిగిందన్నారు. పంట నష్ట పరిహార స్థాయి భీమా మొత్తానికి అనుసంధానంగా పీఎంఎఫ్‌ బీవై దిగుబడి శాతానికి అనుగుణంగా ఏకీకత విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుందని రాజశేఖర్‌ సూచించారు. ప్రాంతాలవారీగా దిగుబడిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. జిల్లావారీగా వాతావరణ ఆధారిత పంట భీమా (డబ్లు్యబిసిఐఎస్‌)ల కోసం పంటల గుర్తింపు అంశాన్ని రాష్ర్ట స్థాయి సమావేశంలో చర్చించారు. గత ఏడు సంవత్సరాలుగా పంట ప్రారంభ దిగుబడి ఆధారంగా గుర్తించబడిన వివరాలతో బీమా పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుందని సూచించారు. చర్చలో భాగంగా ఏకీకత ప్యాకేజీ భీమా పథకం (యుపిఐఎస్‌) పై పలు అంశాలను చర్చించారు. పంటలకు నష్టం వాటిల్లితే పీఎంఎఫ్‌బీవై పథకాన్ని వర్తింపజేస్తారు. మిగిలిన సెక్షన్లన్నీ రైతు ప్రమాదానికి గురైనా, అతని వ్యవసాయ యంత్రాలు, ఇతరత్రా నష్టం వాటిల్లినా వర్తింపజేస్తారు.సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికలను ఫసల్‌ బీమా యోజన కింద  అమలుజేసి రైతులకు మేలు చేకూర్చాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయశాఖ సంచాలకులు కె. ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ క్టస్టర్‌ విధానంలో తొలి క్లస్టర్‌గా అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలు గుర్తించడం జరిగిందన్నారు. రెండవ క్లస్టర్‌లో పశ్చిమగోదావరి, కడప, కష్ణా, కర్నూలు, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాలను ఎంపిక చేశామన్నారు. వాతావరణ ఆధారిత పంటల విధానంలో వేరుశెనగ పంట కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోనూ, పత్తి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ, ఎర్ర మిరప గుంటూరు జిల్లాలోనూ  ప్రధాన పంటగా గుర్తించామన్నారు. అదే విధంగా ఆయిల్‌ ఫామ్‌ ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, కమలాలు కడప, అనంతపురం జిల్లాల్లోనూ, టమోటో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోనూ గుర్తించా మన్నారు. ఏకీకత ప్యాకేజీ భీమా పథకం అమలుకు శ్రీకాకుళం జిల్లాను ప్రతిపాదించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రా బ్యాంక్‌ డీజీఎం, ఎస్‌ఎల్‌ బీసీ కన్వీనర్‌ జీఎస్వీ కష్ణారావు, ఆఫ్కాబ్‌ డీజీ ఎం జయశంకర్‌, నాబార్డు డీడీఎం టి.విజయ్‌, డీసీసీబీ ప్రతినిధి వెంకట్‌రావు, ఇన్సూరెన్‌‌స కంపెనీ ప్రతినిధులు ఎం.రాజేశ్వరిసింగ్‌, హరీష్‌ తదితర 21 కంపెనీ ల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa