గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో చైన్ స్కాచింగ్ జరిగిన ఘటన పై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. రాజీవ్ గాంధీ నగర్ కు చెందిన పి సరోజినీ నడుచుకుంటూ వెళుతున్న సమయంలో అగంతకుడు ఆమె వద్దకు వచ్చి మెడలోని ఆరు సవర్ల బంగారు గొలుసు తెంచుకొని పరారయ్యేందుకు యత్నించాడు. సరోజినీ ప్రతిఘటించి కొంత బంగారు చైను తన చేతిలో పట్టుకుంది. మిగిలిన బంగారం అగంతకుడు తెంచుకొని పరారయ్యాడు. బుధవారం సరోజినీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.