గుంటూరు: ఆన్లైన్ మోసంపై నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం. వెస్ట్ ట్రాఫిక్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేసే వి. రాధారాణి ఈనెల మొదటి వారంలో విజయనగరం సమీపంలోని రాజాంకు డీటీడీసీ సర్వీస్ ఫోన్ నెంబర్ వెతికి ఆ నెంబర్ కు ఫోన్ చేశారు. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి రాధారాణి కి లింక్ పంపి రూ. 5 చెల్లించాలని కోరాడు. దీంతో ఈనెల 6వ తేదీన లింకు ఓపెన్ చేసి రూ. 5 రూపాయలు చెల్లించారు. కొంత సమయం తర్వాత రూ 5. రూపాయలు తిరిగి రాధా రాణి అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి. 7వ తేదీ రాధారాణి అకౌంట్లో నుంచి రూ. 38, 000 విత్ డ్రా అయ్యాయి. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.