ముఖ్యమంత్రి వైయస్. జగన్ అధ్యక్షతన వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయంలో గురువారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను, వ్యవసాయ బడ్జెట్ను, మంత్రిమండలి ఆమోదించింది. ఉప లోకాయుక్త నియామకంలో మార్పులకు సంబంధించిన డ్రాప్ట్ బిల్లుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమావేశంలో అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు.