విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడంటూ ఓ వైద్యురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈమేరకు ప్రేమించిన వ్యక్తికి గతంలోనే పెళ్లి అయినట్లుగా ఆలస్యంగా ఆ యువతి తెలుసుకుంది. దీంతో ప్రియుడితో పెళ్లి కాలేదన్న మనస్తాపంతో వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. యువతి అపస్మారక స్థితిలో పడిపోవడంతో హుటాహుటిన పోలీసులు కేజీహెచ్ కు తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన వైద్యురాలు తూర్పుగోదావరి జిల్లాకు చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.