వాల్తేరు డివిజన్ పరిధిలో సేవలందిస్తున్న భారతీయ రైల్వేలు , ఇండియా పోస్ట్ సంయుక్త పార్శిల్ ఉత్పత్తి సేవను ప్రారంభించాయి. విశాఖపట్నం నుంచి లోకమాన్యతిలక్ టెర్మినస్‌కు 2100 కిలోల మిరియాలు రవాణా అయింది. ఈ పథకం కింద పార్శిల్‌ల మొదటి సరుకు విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో లోడ్ చేశారు. ఇది విశాఖపట్నం స్టేషన్ బుధవారం రాత్రి బయలుదేరింది, వాల్తేరుడివిజన్, ఇండియా పోస్ట్, విశాఖపట్నం నుంచి సీనియర్ అధికారుల సమక్షంలో తొలి పరుగుకు గుర్తుగా డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అవినాష్ శర్మ, పోస్టాఫీసు సీనియర్ సూపరింటెండెంట్ ఆర్. రాహుల్, పోస్టల్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్. డబ్ల్యూ. నాగాదిత్య కుమార్ , రైల్వే , పోస్టల్ చీఫ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. సరుకుల రవాణాలో సమయం, వ్యయాన్ని తగ్గించే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. లాజిస్టిక్స్ ధరను తగ్గించడం దేశ ఆర్థిక వృద్ధికి సహాయపడుతుందని డీఆర్ ఎం ఆనూప్ కుమార్ సత్పతి తెలిపారు