ఏపీలోని పార్వతీపురంలో ఇంటర్ పరీక్ష రాస్తుండగా ఓ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. కొత్తవలసకు చెందిన దేవి ప్రైవేటు కళాశాలలో వెటర్నరీ ఒకేషనల్ కోర్సు చదువుతున్నారు. తొమ్మిదో నెల గర్భిణి అయిన ఆమె తొలి రోజు పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఎక్కువ సేపు కూర్చోవడంతో స్పల్పంగా నొప్పులు వచ్చాయని, డెలివరీకి ఇంకా 2 రోజుల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.