న్యూజిలాండ్‌లో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం, న్యూ కెర్మాడెక్ దీవులలో 7.1 తీవ్రత నమోదైనట్లుగా ప్రపంచంలోని భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించే సంస్థ తెలిపింది. జిలాండ్.. 10 కి.మీ లోతులో భూకంపం వచ్చినట్లుగా తెలిపింది. ఇంత శక్తివంతమైన భూకంపం వల్ల కలిగే నష్టం ఎంత అనేది ఇంత వరకు తెలియలేదు. USGS ప్రకటన ప్రకారం, గురువారం (మార్చి 16) ఉదయం న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవుల ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. సముద్రంలో భూకంపం సంభవించినందున, భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వ్యాసార్థంలో సునామీ సంభవించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.