ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఢిల్లీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. వైస్ కెప్టెన్ గా టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ ను నియమించారు. డేవిడ్ వార్నర్ IPL మ్యాచ్ లను గెలుపొందడంలో విజయవంతమైన 5వ కెప్టెన్ గా నిలిచాడు. అతడు 69 మ్యాచ్ లకు సారథ్యం వహించాడు. ఈ 69 మ్యాచ్ లలో అతడు 47.33 సగటుతో 142.28 స్ట్రైక్ రేట్ తో 2,840 పరుగులు చేశాడు.