కడప జిల్లా ఒంటిమిట్ట మండలం లో గురువారం నడివీధి గంగమ్మ జాతరను నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేకువ జామున అమ్మవారిని మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అమ్మవారికి భక్తులు మొక్కులను సమర్పించారు. ఆలయం సాయంత్రం భక్తులతో కిక్కిరిసిపోయినది. ఆలయ నిర్వాహకులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.