గుంతకల్లు పట్టణంలోని 23వ వార్డు లోని గుంతబావి వీధిలో కార్మికులు చేస్తున్న పారిశుధ్య పనులను, కాలువలలో పూడికతీత పనులను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పరిశీలించారు. అకాల వర్షాలు కారణంగా మురికి కాలువలలో పూడిక పేరుకుపోయి మురికినీరు వీధుల్లోకి వెళ్లి ప్రజలకు అసౌకర్యం అవుతుందని కావున కాలువలలో పూడిక లేకుండా చర్యలు తీసుకో వాలని శానిటేషన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కు సూచించారు. సచివాలయం శానిటరీ కార్యదర్శు లు ఎప్పటికప్పుడు వార్డులలో పర్యటించి పారిశుధ్యం మెరుగుకు పని చేయాలని ఆదేశించారు.