గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో భర్త అదృశ్యమైనట్లు అరండల్ పేట పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి కేసు నమోదయింది. నగరపాలక సంస్థ పరిధిలోని కొండయ్య కాలనీకి చెందిన నరేష్ ఓ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఈనెల 14న నరేష్ మద్యం తాగడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు రాత్రి నరేష్ ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికిన ఆచూకీ లభించకపోవడంతో భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.