బనగానపల్లె మండలంలోని నందవరం చౌడేశ్వరి మాత ఆలయ హుండీని గురువారం లెక్కించారు. ఆలయ ఈవో రామానుజన్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ అధికారి హరిశ్చంద్రారెడ్డి సమక్షంలో హుండీని లెక్కించారు. నాలుగు నెలల కాలానికి రూ. 35. 38 లక్షల ఆదాయం లభించిన్నట్లు ఈవో తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బందితో పాటు భక్తులు పాల్గొన్నారు. ఈవో మాట్లాడుతూ భక్తులు అమ్మవారికి సమర్పించే కానుకలు హుండీలో వేయాలని కోరారు.