గుంటూరు: మూడు రోజుల పాటు అధిక వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో, మిర, పసుపు, రైతులు కోతలు కొయ్య వద్దని జిల్లా ఉద్యాన అధికారి ఎన్. సుజాత గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ఇప్పటికే కల్లాలలో ఆరబోసిన మిరపకాయలు, పసుపు కొమ్ములను సిల్ఫాలిన్, టార్ఫాలిన్ పరదాలతో కప్పుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.