ఏపీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆహారం కల్తీ అయింది. నంద్యాల - నెరవాడ గురుకుల పాఠశాలలో సుమారు 50 మంది విద్యార్థినులు కల్తీ ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. అర్థరాత్రి బాలికలకు వాంతులు, విరేచనాలు కావటంతో సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం స్నాక్స్‌లో తిన్న బొరుగుల మిక్షర్ వల్ల ఫుడ్‌పాయిజన్ అయినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.