పెరుగు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే రాత్రి పూట పెరుగు తినడం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. అయితే పెరుగును రాత్రిపూట తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో కఫం వస్తుంది. తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది మంచిది కాదు. రాత్రి పూట పెరుగు తింటే కనీసం రెండు గంటల గ్యాప్ ఇచ్చిన తర్వాతే పడుకోవాలి. లేదంటే సరిగా ఆహారం జీర్ణం అవ్వదు.