నరసరావుపేట: వైయస్సార్ జగనన్న శాశ్విత భూ హక్కు, భూరక్షణ పథకం కింద అటవీ భూములు రీ-సర్వే సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అడవిశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ శివ శంకర్ సూచించారు. గురువారం కలెక్టరేట్ జిల్లా ఫారెస్ట్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా అటవీ శాఖాధికారి రామచంద్రరావు, ఇతర అధికారులతో పలు అంశాలపై సమీక్ష చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఆల్బమ్ ను అటవీశాఖాధికారి కలెక్టర్ కు అందజేశారు.