విద్యార్థులు కల్తీ ఆహార పదార్థాలు పై అవగాహన కలిగి ఉండాలని కన్యుమర్ కో ఆర్డినేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు చదలవాడ హరిబాబు అన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులని విద్యార్థులు కల్తీ ఆహార పదార్ధములు తినకూడదని ముఖ్యముగా చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ వంటివి ప్రమాదకరమని, తయారీ దారులు టేస్ట్ సాల్ట్, వెనిగర్, సాస్ వంటి హానికరమైన రసాయన పదార్థములు కలిపి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులకు గురి అవుతున్నారన్నారు. ప్రభుత్వం నియంత్రణ లోపించినదని ఆవేదన వ్యక్తం చేశారు. అరటి కాయలపై కార్ బైట్ లిక్విడ్ స్ప్రే చేస్తూ వ్యాపారులు విద్యార్థులను అనారోగ్యమునకు గురి చేస్తున్నారు అన్నారు. బి. నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి వస్తువు కొనుగోలు చేసిన వెంటనే రసీదు తీసుకోవాలా అన్నారు. ప్రధానోపాధ్యాయులు బి. రాజశ్రీ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే వినియోగదారుల రక్షణ చట్టము పై అవగాహన కలిగి ఉండుట వలన ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు అన్నారు. ఈ కార్యక్రమంలో పి. బాలకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు.