గుంటూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అదనపు కట్నం కోసం మహిళా కానిస్టేబుల్ ను వేధిస్తున్న భర్త పై గురువారం పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గుజ్జనగుండ్ల పరిధిలోని కళ్యాణి నగర్ కు చెందిన కనకపు వరలక్ష్మి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. 2021 సంవత్సరంలో సన్నాయిలు వెంకటరమణ ను ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు