మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అందుకు అనుగుణంగా మబ్బులు చేయడం. చిరుజల్లులు పడుతున్నాయి. సంవత్సరం అంతా కష్టించి పంట చేతికి వచ్చే సమయానికి ఈ వర్ష సూచనతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. పెదకూరపాడు మండలంలో 9000 ఎకరాల్లో మిరప సాగు చేశారు. పంట పండింది. ముమ్మర కోతల సమయంలో వర్షం పడితే వంట నేలపాలవుతుంది.