గుంటూరు నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్నులపై నుండి ఇప్పటి వరకు ఉన్న వడ్డీని మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జిఓ ఎంఎస్ 34 విడుదల చేసిందని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. పన్ను బకాయిదార్లు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని, పెండింగ్ బకాయిలు చెల్లించి వడ్డీ మాఫీ ని పొందాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి గురువారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.