నాగార్జున యూనివర్సిటీ లో జరిగిన ఒక కార్యక్రమంలో యవత ను ఉద్దేశించి తప్పుగా మాట్లాడి, మహీళ అని చుడకుండా అతి నీచంగా మాట్లాడినటువంటి సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ని వెంటనే అరెస్టు చేయ్యలని గుంటూరు నగర యన్ యస్ యుఐ అధ్యక్షులు షేక్ కరీమ్ అధ్వర్యంలో గురువారము రాత్రి జిల్లా కాంగ్రెస్స్ కార్యలయం వద్ద రాంగోపాల్ వర్మ దిష్టిబొమ్మ ను దగ్ధం చేసే కార్యక్రమం చేపట్టటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, నగర అధ్యక్షులు షేక్ ఉస్మాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ మహీళలను కించపరుస్తూ, యువత ను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడిన రాంగోపాల్ వర్మ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని యూనివర్సిటీ ఛాన్స్ లర్ పిల్లల తల్లిదండ్రులకు వేంటనే క్షమాపణలు చెప్పాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యూనివర్సిటీ వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అభిప్రయా పడ్డారు ఈ కార్యక్రమం లో నగర అధ్యక్షులు షేక్ ఉ స్మాన్, జిల్లా ఉపాధ్యక్షులు అంబటి రత్తయ్య, తిరుమల రావు, సుమంత్, నాగూర్. అల్లావుద్దీన్, ఇమాం నగర ఉపాధ్యక్షులు సయ్యద్ జాని గోల్డ్, తూర్పు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మీర్ మహబూబ్ అలీ, మస్తాన్ వలీ, మల్లెల మేషె ఇస్మాయిల్, నూరుల్లా, రామక్రిష్ణ, రఫీ, జాని, మెఘనాద్, తదితరులు పాల్గొన్నారు.