అమరావతిలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు ఎమ్మెల్సీ డా. కుంభా. రవిబాబు బడ్జెట్ సమావేశాలకు హాజరై సమావేశ ప్రాంగణంలో సిఎం జగన్ ని కలిశారు. జూలైలో విశాఖ నుండి పరిపాలన కొనసాగుతుందని సిఎం ప్రకటించిన నేపథ్యంలో రవిబాబు సిఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రవిబాబు మాట్లాడుతూ. విశాఖ అభివృద్ధి పథంలో పురోగమిస్తోందని దేశంలో అన్ని నగరాలకన్న మొదటి స్థానం త్వరలో విశాఖకు దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ పలు అంశాలను సిఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్ రమేష్ రాజు ఉన్నారు.