పెద్దకడబూరు: మండలంలోని వివిధ గ్రామాలలో ఇటివల ఎస్ఆర్పీ వెంకటేష్ నాయక్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో అమలయిన పనులు పంచాయతీ రాజ్ శాఖ, హౌసింగ్, పెన్షన్లు వంటి వాటిపై సామాజిక తనిఖీ నిర్వహించారు. శుక్రవారం ఆదోని మండల పరిషత్ కార్యాలయంలో పెద్దకడబూరు మండలానికి సంబంధించి సామాజిక తనిఖీ బహిరంగ సభ నిర్వహించారు. ఉపాధి పథకం ప్రాజెక్టు డైరెక్టర్ అమర్నాథ్ రెడ్డి సమక్షంలో పంచాయతీల వారీగా సామాజిక తనిఖీలో గుర్తించిన అవకతవకలను డీఆర్పీలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకట రమణప్ప, ఏపీఓ రామన్న తదితరులు పాల్గొన్నారు.