కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి మధ్యంతర పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ తనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని కోరారు. అయితే అవినాష్ ను అరెస్ట్ చేయొద్దని తాము చెప్పలేమని, అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించుకోవచ్చని హైకోర్టు తెలిపింది.