సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో శనివారం ఉదయం వికటజీవిగా పడి ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు హిందూపురం వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని పరిశీలించగా మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అంత్యక్రియల కోసం స్వచ్ఛంద సంస్థలకు అప్పగించనున్నట్లు తెలిపారు.