గొర్రెలు మేకలు పెంపకం దారుల సహకార సంఘాల సమాఖ్య జిల్లా యూనియన్ ముగ్గురు సభ్యుల (త్రీ మ్యాన్) కమిటీ చైర్మన్ గా పసుపుల నరసింహ గౌడ్ కు అవకాశం ఇవ్వడం పట్ల పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. శుక్రవారం విజయవాడలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పసుపుల నరసింహ గౌడ్ మంత్రిని కలిశారు. ఈ త్రీ మాన్ కమిటీలో చైర్మన్ గా పసుపుల నరసింహ గౌడ్, సభ్యులు గా ఈశ్వరయ్య, కృష్ణప్ప ఉంటారు. రాప్తాడు మండలానికి చెందిన పసుపుల నరసింహ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆశీస్సులతో తనను నియమించారని నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎమ్మెల్యేకు, పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.