శ్రీ సత్య సాయి జిల్లా అమడగూరు మండలంలో అర్థరాత్రి వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో ఏకధాటిగా వడగండ్ల వర్షం కురవడంతో మొక్కజొన్న పొద్దు తిరుగుడు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పేరేవాండ్లపల్లి వద్ద కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు పూర్తిగా కాలిపోయింది. పాప సోపాలు పడి అప్పులు చేసి పంట సాగు చేస్తే చేతికి వచ్చిన పంట వర్షానికి పూర్తిగా నాశనం అయిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం నట్టేట ముంచిందని ప్రభుత్వం స్పందించి పంట నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో వేరుశనగ మొక్కజొన్న పంట తొలగించిన రైతులు ఆందోళన చెందుతున్నారు.