పుట్టపర్తి మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య ఇంజనీరింగ్, క్లాప్ డ్రైవర్స్, అండర్ డ్రైనేజ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని, సమస్యలు పరిష్కరిస్తూ శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట బైఠాయించి సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ మాట్లాడుతూ మాట తిప్పం మడమ తిప్పమనే అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి నాలుగేళ్లు కావస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో వైభల్యం చెందారని మండిపడ్డారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య ఇంజనీరింగ్, క్లాప్ డ్రైవర్స్, అండర్ డ్రైనేజ్, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని, సమానపనికి సమానవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న మూడు నెలల జీతాలు ఇవ్వాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఐదు నెలలు పీఎఫ్ సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్, ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలన్నారు. క్లాప్ ఆటో డ్రైవర్లకు 18, 500 వేతనం చెల్లించాలని, పర్మినెంట్ కార్మికులకు జి పిఎఫ్అకౌంట్ ఓపెన్ చేయాలన్నారు. మరణించిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జాయిన్ జాయింట్ కలెక్టర్ చేతన్ కు అందజేశారు.