టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను పుట్టపర్తి నియోజకవర్గంలో విజయవంతం చేద్దామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. టిడిపి కార్యాలయంలో పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ, ఈ అసమర్థ పాలనను ప్రజలకు వివరిస్తూ లోకేష్ 400 రోజులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర యువగళం పేరుతో చేపట్టారన్నారు. చరిత్రలో ఇంతవరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర ఎవరు చేయలేదన్నారు. ఈరోజు పాదయాత్ర సత్యసాయి జిల్లాలో ప్రారంభమవుతుందన్నారు. తనకల్లు, నల్లచెరువు, కదిరి మండలాల మీదుగా పాదయాత్ర 21న పుట్టపర్తి నియోజకవర్గం లో చేరుతుందన్నారు. ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున తెలుగు యువత, నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ 2024 ఎన్నికలకు ఇది నాంది కావడానికి మన సత్తా ఏమిటో నిరూపించాలన్నారు.