శ్రీసత్యసాయి జిల్లా రామగిరి రేంజ్ కనగానపల్లి మండలం , పొర్లపల్లి , చంద్రాచర్లలో అటవీ శాఖ అధికారులు అవినీతి మిన్నంటిందని ఆర్ యు యస్ ఎఫ్ రాష్ట్ర ఉపాద్యక్షుడు పిక్కిలి మహేష్ గౌడ్ తెలిపారు. ఈ విషయంపై ఆయన తన బృందంతో కలిసి శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ కి వచ్చి జాయింట్ కలెక్టర్ చేతన్ కి ఫిర్యాదు చేసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ రామగిరి రేంజ్ పరిధిలో అటవీ శాఖ అధికారుల అవినీతికి అడ్డుఆపు లేకుండా పోయిందని అన్నారు. వీరు కనగానపల్లి, చంద్రాచర్ల, పోర్లపల్లి గ్రామాల్లో ఒక్కో గొర్రెల కాపరి గుంపు నుంచి 3 నుంచి 5వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో గొర్రెలు కాపర్లు బతకాలంటేనే ఇబ్బందిగా మారిందని తెలిపారు. నెల మామూల్లు చెల్లించని కాపరులు అడవిలో గొఱ్ఱెలు మేపుటకుపోతే వారిపై అక్రమకేసులు బానాయిస్తామని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. ఇంతేకాకుండా అడవులు ఎక్కడికక్కడ కాలిపోతున్న అధికారుల చర్యలు శూన్యమని పేర్కొన్నారు. ఎక్కడైనా అడవి తగలబడుతున్నదని సంభందిత అధికారులకు తెలిపినా. మంటలు అర్పాలంటే జ్వరం వస్తోందని కుంటిసాకులు చెబుతున్నారని మహేష్ తెలిపారు. ఇప్పటికైనా అటవీ అధికారులపై చర్యలు తీసుకొని గొఱ్ఱెల కాపరులు, అటవీ సంపదను రక్షించాలని జాయింట్ కలెక్టర్ చేతన్ ని మహేష్ గౌడ్ కోరారు.