వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే నాలుగు సార్లు విచారణకి పిలిచిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ...వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చెయ్యడం తథ్యం అని జోస్యం చెప్పారు . హైకోర్టు ఆర్డర్ కాపీ అందగానే అవినాశ్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయన్నారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంను ఆశ్రయిస్తారా..?, లేకపోతే వ్యక్తిగతంగా వెళతారా అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఒకవేళ సుప్రీంకోర్టులో సోమవారం అత్యవసర పిటిషన్ దాఖలుచేస్తే, జగన్ కేసులను వాదించిన న్యాయవాదులే, పిటిషనర్ తరఫున వాదనలు వినిపించనున్నారని చెప్పారు.