తుఫాన్ ప్రభావంతో శనివారం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలతో పాటు పలుజిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా చోటా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కేవలం పల్నాడు జిల్లాలో మొత్తం కలిపి 441. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.