గోపవరం మండల పరిధిలోని గరుడయ్య సత్రం వద్దనున్న కుంటను కబ్జా నుండి కాపాడాలని సిపిఐ నాయకులు కోరారు. కుంటను ఆక్రమణ చేయడానికి సిద్ధం చేసిన పోల్స్ ను, కుంట స్థలాన్ని పరిశీలించిన అనంతరం సిపిఐ జిల్లా సమితి సభ్యులు పి. చంద్రమోహన్ రాజు, మండల కార్యదర్శి గూడూరు పెంచలయ్యలు మాట్లాడుతూ గోపవరం గ్రామ రెవెన్యూ పోలంలోని గరుడయ్య సత్రం ఎదురుగా ఉన్న కుంట మరియు రాళ్లగుట్ట స్థలాన్ని కబ్జాల నుండి కాపాడాలని వారు డిమాండ్ చేశారు. సుమారు పది ఎకరాల పైబడి ఉన్న రాళ్లగుట్ట, ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుండి కాపాడాలని, ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి కబ్జాలకు ప్రయత్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలసహాయ కార్యదర్శి ప్రభాకర్ నాయకులు జి. ఎల్ నరసింహులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.