అంగన్వాడి కేంద్రంలో చదువుతున్న ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ కార్డు నమోదు చేయాలని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి , ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీలత పేర్కొన్నారు. శుక్రవారం పులివెందుల పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో అంగన్వాడి సిబ్బందితో వారు మాట్లాడారు. మున్సిపల్ కార్యాలయం ద్వారా బర్త్ సర్టిఫికెట్ కచ్చితంగా ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.