సత్తెనపల్లి పట్టణంలోని బీసీ కళాశాల బాలికల వసతి గృహం -1 సంరక్షణ అధికారిణి ఇందిరా గాంధీ లకు అధికారులు శుక్రవారం షోకాజ్ నోటీసులో జారీ చేశారు. భోజన మెనూ అమలులో లోపాలను ఈ నెల 6న ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాపరెడ్డి గుర్తించి చర్యలకు జేసీకి సిఫారసు చేసిన నేపథ్యంలో నోటీసులు జారీ చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు.