సీఎం జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో ప్రజలకి చెప్పాలి అంటూ అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ నాయకులూ, వైసీపీ నాయకులని ప్రశ్నించారు. దీనికి బదులుగా ఈ నెల 17న ఢిల్లీ పర్యటన అధికారిక పర్యటనే అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అనటం దారుణమన్నారు. సమాధానం చెప్పకపోతే మేము బాయ్‌కాట్ చేస్తామని చెప్పడం సమంజసం కాదని చెప్పారు. ముందుగానే ప్రిపేర్ అయి వచ్చి బాయ్‌కట్ చేస్తామని చెప్తున్నారని పేర్కొన్నారు.