ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 680 మండలాలు ఉన్నాయని, 7 మండలాలకు సంబంధించిన అతిపెద్ద సమస్య ఐనటువంటి ఉద్దానం సమస్య టీడీపీ కళ్లకు కనిపించలేదా..? అని మంత్రి రజిని ప్రశ్నించారు. ఉద్దానం ప్రజలకు మంచి చేస్తున్న వైయస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ సభ్యులు ఆరోపణలు చేయడం హేయం అన్నారు. ఇదేనా ఉద్దానం ప్రజలపై ప్రతిపక్షానికి ఉన్న చిత్తశుద్ధి అని నిలదీశారు.