రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్నిమరింత అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండు ఉచిత ఫోన్ నంబర్లను ఏర్పాటు చేశాయి. రైతులు 1800-425-1110, 1800-180-1551 నంబర్లకు ఫోన్ చేసి శాస్ట్రవేత్తలతో తమ సమస్యల గురించి చర్చించి పరిష్కార మార్గాలు పొందవచ్చు.