ఉత్తరాంద్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చీరంజీవిరావు ఉత్తరాంధ్రలో భారీ మెజారిటీతో గెలిచినందుకు మాడుగుల మండల కేంద్రమైన మాడుగులలో మండల పార్టీ కార్యాలయంలో టిడిపి నాయకులు ఆధ్వర్యంలో ఆనంద సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల పార్టీ కార్యదర్శి ఉండురు దేముడు మాట్లాడుతూ.. ఈ పట్టబద్రులు శాసనమండలి నాయకులు ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు సరైనా గుణపాఠం చెప్పారని తెలిపారు. అలాగే ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వంపై విసిగిపోయి ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇలానే బుద్ధి చెప్పాలని తెలిపారు.