నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమెన్ ఎంపవర్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం డిపార్టుమెంట్ ఆఫ్ ఆయుష్, విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ కె. లావణ్య, విశ్వ ఆయుర్వేద పరిషత్ డాక్టర్ శ్రీబాల హాజరయ్యారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రాజు మాట్లాడుతూ ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన అవసరమన్నారు.