బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. శుక్రవారం రాత్రి నుంచే అక్కడడక్కడ చిరుజల్లులు కురుస్తుండగా. శనివారం విశాఖలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. శనివారం, ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు ఇప్పటికే చెప్పారు. ప్రస్తుతం విశాఖ మొత్తం కూల్‌కూల్‌గా మారిపోయింది.