అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని మదర్సాలనూ మూసివేస్తానని తేల్చి చెప్పారు. చాన్నాళ్ల క్రితమే ఈ హామీ ఇచ్చిన హిమంత.. ఇకపై అమలు చేస్తామని స్పష్టం చేశారు. పిల్లలందరూ స్కూల్స్, కాలేజీల్లో చదువుకోవాలని అనుకుంటున్నారన్నారు. ఈ మదర్సాలు ఉండటం వల్లే కొందరు పొరుగు దేశాల నుంచి వచ్చి ఇక్కడ కుట్రలు చేస్తున్నారన్నారు. ఇలాంటి అక్రమ వలస దారులను అడ్డుకోటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.