ఇంట్లో ఉదయం, సాయంత్రం రెండు పూటలా దీపం వెలిగించాలని శాస్త్రం చెబుతోంది. అయితే దక్షిణ దిశగా దీపారాధన చెయ్యకూడదట. దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దు:ఖం, బాధ కలుగుతాయి. అదే తూర్పు ముఖంగా వెలిగించే దీపం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. పడమర వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు, శని గ్రహ దోష నివారణ జరుగుతుంది. ఉత్తర దిశగా వెలిగించే దీపం సిరిసంపదలు, విద్య, వివాహ ప్రాప్తికి దోహదం చేస్తుంది.