ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరాపురం లో ఉచిత వైద్య శిబిరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 11:08 AM

అమరాపురం ప్రాథమిక పాఠశాలలో ఆదివారం వైద్య ఆరోగ్య మైత్రి కూటమి ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని 250 మంది రోగులు సద్వినియోగం చేసుకున్నారు. కర్ణాటక చిత్రదుర్గం యూనిటీ హెల్త్ కాంప్లెక్స్ స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ జ్యోతి విజయ్ కుమార్ 180 మంది మహిళా రోగులను పరీక్షించి రూ. 25 వేల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. బెంగళూరు నుంచి వచ్చిన దంతవైద్యులు నరేంద్రకుమార్ 70 మంది రోగులను పరీక్షించి మందులు అందజేశారు. మైత్రి కూటమి సభ్యులు డాక్టర్ బసవరాజు, శ్రీనివాసమూర్తి, రమేశ్ తదితరులు అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com