రాష్ట్రంలో వచ్చే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో జగన్ ఇలాకాలో టీడీపీ జెండాను ఎగురవేస్తామని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఓ శుభ కార్యక్రమానికి ఆదివారం హాజరైన పల్లె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ తరపున నిలిచిన అభ్యర్థులను ఓడించేందుకు. అధికారపార్టీ నాయకులు, సీఎం జగన అధికారాన్ని అడ్డుపెట్టుకుని పన్నిన కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఇన్నీకా వన్నారు. సీఎం జగన రాష్ట్ర రాజధానిగా విశాఖను చేస్తామనినా విద్యా వంతులు, ప్రజలు, ఉపాధ్యాయులు అమరావతే రాజధానిగా ఉం డాలని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించారన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి ఉండాలన్న, రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమని, నిరుద్యోగ యువతీ యువకులు, పట్టభద్రులు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించారన్నారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్ చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందన్నారు. సీఎం జగన అరాచకపాలనలో రైతులు, ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు పడుతున్న కష్టాలను తెలుసుకుని వారికి అండగా నేనున్నానంటూ రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజులు నాలుగు వేల కిలమీటర్లు చేపట్టిన లోకేశ పాదయాత్రతో టీడీపీకి ఎంతో బలం చేకూరుతుందన్నారు. ఈనెల 21న పుట్టపర్తి నియోజకవర్గంలో లోకేశ పాదయాత్ర మొదలవుతుందన్నారు. ఈ పాదయాత్రకు ప్రతి కార్యకర్త, నాయకులు తరలిరావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సాలక్కగారి శ్రీనివాసులు, రామకృష్ణ, ఒలిపిశీన, సుధాకర్, సురేష్, వెంకటరమణప్ప, సుబ్రహ్మణ్యం, వెంకటేశ, రామచంద్ర, పెద్దన్న, సుబ్బరాయుడు, రాజు, షర్పుద్దీన, మౌలా, కిలారి శ్రీనాథ్, సప్లయర్స్ రామ్మోహన పాల్గొన్నారు.