కంబదూరు మండల కేంద్రంలో ఏ కార్యాలయ ఆవరణంలో చూసినా, చెక్ పోస్ట్ ప్రాంతపు సమీపంలో చూసినా కర్ణాటక మద్యపు ప్యాకెట్లు దర్శనమిస్తుమిస్తున్నాయని పలువురు తెలిపారు. మండుటెండ వేసవి కాలంలో దాహార్తి తీర్చుకోవడానికి గుక్కెడు నీరు దొరుకుతాయో, లేదో తెలియదు కాని కర్ణాటక మద్యం మాత్రం పుష్కలంగా లభిస్తుందని మండల ప్రజలు చర్చించుకుంటున్న మాటలు అనేకంగా వినిపిస్తున్నాయి. సరిహద్దులను దాటి ఏరులై పారుతున్న కర్ణాటక మద్యాన్ని నివారించవలసిన అధికారులు ఉన్నారా లేదా అనే కోణంలో మండల ప్రజలు విమర్శిస్తున్నారు.